: జపాన్ ఎకనమిక్ జోన్‌పైకి ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. జీ 20 సమ్మిట్‌కు ముందు ఘటన!


ఉత్తర కొరియా మరోమారు రెచ్చిపోయింది. వచ్చే వారం జర్మనీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు క్షిపణి ప్రయోగం నిర్వహించి తన ఉద్దేశాన్ని చాటింది. మంగళవారం కోస్తాలోని పశ్చిమ ప్రాంతం నుంచి సముద్రంలోకి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి కలకలం రేపింది. 40 నిమిషాల ప్రయాణం తర్వాత జపాన్‌ ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ (ఈఈజడ్)ను క్షిపణి తాకినట్టు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఇది ఉల్లంఘించడమేనని జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌కు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయోగం జరిగినట్టు దక్షిణ కొరియా తెలిపింది. జూలై 7, 8 తేదీల్లో జరగనున్న జీ20 సమ్మిట్‌లో అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాలు ఉత్తర కొరియా అణుపరీక్షలపై చర్చించనున్న నేపథ్యంలో తాజా ప్రయోగం జరగడం కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News