: డ్రగ్స్ కేసు.. తెరపైకి టాలీవుడ్ బడా దర్శకుడి పేరు!
హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోంది. చదువులతో బిజీగా ఉండాల్సిన స్కూల్ పిల్లలు, ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ ఊబిలో కూరుకుపోతున్నారు. మాదకద్రవ్యాల మత్తులో ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తాజాగా వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నాలుగు ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఎనిమిది ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పవిత్ర ప్రదేశంలో డ్రగ్స్ వినియోగం ఆందోళనకు గురి చేస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు డ్రగ్స్ వాడుతుండటం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత పేరు ఉండటం షాక్ కు గురిచేసింది. డ్రగ్స్ పరఫరా చేస్తున్న కెల్విన్ తో ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడట. తాజాగా, టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి పేరు తెరపైకి రావడంతో ఫిలిం నగర్ ఉలిక్కిపడింది. ఏడాదికి ఒక సినిమా తీస్తూ, ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ దర్శకుడు ఎల్ఎస్డీ డ్రగ్స్ వాడుతున్నాడన్న నిజం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విస్తుపోయారట. ఆయన తన కోసమే ఈ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడా? లేక ఇతరులకు ఇవ్వడానికి తీసుకుంటున్నాడా? అనే ప్రశ్నలు అధికారుల్లో తలెత్తుతున్నాయి.