: నేను చేసిన తప్పు ఇదే...తల్లిదండ్రులూ! మీ పిల్లలు చెప్పేవన్నీ నిజాలని నమ్మవద్దు: డ్రగ్ బాధిత బాలిక తల్లి


తాను చేసిన తప్పు ఏ తల్లిదండ్రులు చేయవద్దని హైదరాబాదులో వెలుగు చూసిన డ్రగ్ మాఫియాలో బాధితురాలి తల్లి విజ్ఞప్తి చేసింది. ఆమె మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేయరని, నిజం చెబుతున్నారని అనుకుంటారని అన్నారు. తాను కూడా అలాగే అనుకున్నానని ఆమె చెప్పారు. టీవీ చూస్తే చదువుకోమంటావు, ఏం చేసినా చదువుకోమంటావు...కనీసం స్నేహితురాళ్ల ఇంటికి కూడా వెళ్లనివ్వవా? అంటూ అడిగేదని, ఫ్రెండ్ దగ్గరకెళ్లి నోట్స్ తెచ్చుకోవాలంటూ తన కుమార్తె ఎప్పుడూ వెళ్లేదని... అయితే డ్రగ్స్ ముఠా బాధితుల్లో తన కుమార్తె కూడా ఉందని తెలిసి నివ్వెరపోయామని, దానిపై అడిగితే సూసైడ్ చేసుకుంటామని బెదిరింపులకు దిగుతుందని ఆమె చెప్పారు.

తన కుమార్తెకు తెలియకుండా పరీక్షలు నిర్వహించి, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ ను చూపించి నిలదీస్తే అప్పుడు నిజం చెప్పిందని, ఏడ్వడం, భోజనం మానేయడం ఆరంభించిందని ఆమె తెలిపారు. అందుకే తాను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని, పిల్లలు మంచిదారిలోనే నడుస్తున్నారని భావించవద్దని, వారిపై ఒక కన్నేసి ఉంచాలని ఆమె సూచించారు.

  • Loading...

More Telugu News