: మోదీకి అదిరిపోయేలా స్వాగతం చెప్పేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్.. రెడ్ కార్పెట్ స్వాగతానికి రెడీ అయిన నెతన్యాహు!


భారత ప్రధాని నరేంద్రమోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో మోదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు రెడ్ కార్పెట్ స్వాగతానికి సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహం మోదీ టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌కు స్వాగతం పలకడమే కాదు.. ఆయన పర్యటన మూడు రోజులూ వెంట ఉండనున్నారు.

మోదీ అక్కడి అధ్యక్షుడు, ప్రధానితో పాటు ప్రతిపక్ష నేతతోనూ చర్చలు జరపనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు, పోప్‌కు మాత్రమే ఇటువంటి ఆహ్వానం దక్కినట్టు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల పర్యటించిన డొనాల్డ్ ట్రంప్‌కు కేటాయించిన సూట్ రూములోనే మోదీకి కూడా బస ఏర్పాటు చేశారు. అలాగే మోదీ కోసం వివిధ రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. నాన్-వెజ్ సెక్షన్‌లో ఒక్క చేపలకు మాత్రమే చోటు కల్పించారు. అలాగే భారతీయ పద్ధతిలో టీ సిద్ధం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News