: సల్మాన్ ఖాన్ బాడీగార్డుకి నెల జీతం ఎంతో తెలుసా?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి షెరా అనే వ్యక్తి బాడీగార్డ్‌గా ఉన్నాడు. ఆయన అసలు పేరు గుర్‌మీత్ సింగ్ జాలీ. గత 20 ఏళ్లుగా షెరా సల్మాన్‌కు బాడీగార్డుగా పని చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ కీలక పనులన్నీ ఎంతో నమ్మకంగా ఆయనే చూసుకుంటాడు. ఇటీవల భారత్‌కు వచ్చిన కెనడియన్ పాప్‌స్టార్ జస్టిన్ బీబర్‌ని చూసుకునే బాధ్యత కూడా ఆయనకే అప్పజెప్పాడు సల్మాన్.
తాజాగా మీడియా అడిగిన ప్రశ్నలకు షెరా సమాధానాలు ఇచ్చాడు. గతంలో సల్మాన్ కోసం అభిమానులు వచ్చి, గుంపులుగా చేరిపోయేవారని, గత కొన్నాళ్లుగా ఈ విషయంలో సల్మాన్ ఖాన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటున్నానని చెప్పాడు. సల్మాన్‌కి బాడీగార్డుగా ఉండటం కాస్త కష్టమేనని అన్నాడు. ఇంతకీ షెరాకి సల్మాన్ ఇస్తోన్న జీతం ఎంతో తెలుసా? నెలకు అక్షరాలా రూ. 15 లక్షలు!