: రేపు మోదీకి సాదరస్వాగతం పలుకుతాం: ఇజ్రాయెల్ ప్రధాని
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి మూడు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా మోదీ రాకకోసం తాము వేచి చూస్తున్నామని, ఆయనకు సాదరస్వాగతం పలుకుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు తెలిపారు. ఇరు దేశాలు భద్రత, వ్యవసాయం, నీరు, ఇంధనం సహా మరిన్ని రంగాలపై ఒప్పందాలు చేసుకుంటాయని ప్రకటించారు. రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరగనుందని చెప్పారు. తాను గతంలో మోదీతో ఐక్యరాజ్యసమితి, దావోస్ సమావేశాలలో ఈ విషయాలపై చర్చించానని చెప్పారు.