: పవన్, మోదీల కాళ్లను పట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని, అవసరమైతే కన్నకొడుక్కీ ఆయన వెన్నుపోటు పొడుస్తారని వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు అవసరమైతే కాళ్లు పట్టుకుంటారని, లేకుంటే జుట్టు పట్టుకుంటారని విమర్శించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పాటు నరేంద్ర మోదీ కాళ్లను పట్టుకునే చంద్రబాబు గెలిచారని అన్నారు. అలాగే, తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయిన వారిపై కూడా నాని విమర్శలు చేశారు. అధికార పార్టీని ఎదుర్కోలేకనే వారంతా జంప్ అయ్యారని, అలాంటి దద్దమ్మలు వైసీపీలో లేకపోయినా ఫర్వాలేదని అన్నారు.