: సయ్యద్ సలావుద్దీన్ ఆ పేరుకి తగిన వాడే!: కేంద్ర హోం శాఖ


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు సదరు అగ్రరాజ్యం హిబ్జుల్‌ ముజాహిదీన్‌ సంస్థ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన భార‌త్‌... స‌లావుద్దీన్‌ ఉగ్రవాదేనని అతడు ఇటీవల మాట్లాడిన తీరే తెలుపుతోంద‌ని పేర్కొంది. కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి అశోక్‌ ప్రసాద్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... భారత్‌లో త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన చోట దాడులు చేయగలమ‌ని స‌య్య‌ద్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. ఆయ‌న‌కు అమెరికా ప్రపంచ ఉగ్రవాది అని పేరు పెట్టిందని అన్నారు. ఆ పేరుకు ఆ ఉగ్ర‌వాది తగినవాడని అన్నారు.

  • Loading...

More Telugu News