: ‘భరతమాత’పై అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు!
చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ‘భరతమాత నుదుటిన హిందువులు తిలకం దిద్ది వీధుల్లో తిరిగితే.. భరతమాతకు టోపీ, గడ్డం పెట్టి తిరిగే దమ్ము ముస్లింలకు ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రాతిపదికగా ఉన్న దేశంలో హిందువులకు ఎంత హక్కు ఉందో, ముస్లింలకూ అంతే హక్కు ఉందని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్, అసెంబ్లీల్లో చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ముస్లింలు తేరుకోకపోతే తీవ్ర నష్టం తప్పదంటూ హెచ్చరించారు.