: డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి: నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు
భారత్‌లో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న తీరుపై నీతి ఆయోగ్ ముఖ్య సలహాదారు రతన్ పి వతల్ వివరాలు తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 55 శాతం మేర పెరిగాయని, భవిష్యత్తులో ఈ శాతం మరింత పెరుగుతుందని తెలిపారు. భారత్‌లో డిజిటల్ విప్లవం వస్తుందని అన్నారు. నగదురహిత లావాదేవీలు సరళతరం అయ్యాయని, ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఈ కారణంగానే నగదురహిత లావాదేవీలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 25 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అలాగే 2011-12 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు నగదు రహిత లావాదేవీల పెరుగుదల సరాసరి సంవత్సరానికి 28 శాతంగా నమోదైందని ఆయన వివరించారు.