: సీఎన్ఎన్ మీడియా లోగోను తాను స్వ‌యంగా చిత‌క్కొడుతున్న‌ వీడియోను పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్!


సీఎన్ఎన్ మీడియాపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ తీరులో మండిపడ‌తారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ ఛానెల్‌పై త‌న కోపాన్నంతా చూపిస్తున్న‌ట్లు ట్రంప్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. సీఎన్ఎన్ మీడియాను ట్రంప్‌ స్వ‌యంగా చిత‌క్కొడుతున్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. ఎడిట్ చేసిన ఓ వీడియోని ఇలా పోస్ట్ చేసి ట్రంప్ మ‌రోసారి వివాదం రేపారు. ఆ వీడియోలో విన్స్ మహోన్ అనే రెజ్లర్ ముఖాన్ని ఎడిట్ చేసి సీఎన్ఎన్ అనే లోగోను పెట్టి ఆయ‌న‌పై ప‌డి ట్రంప్ పంచ్ లు విసిరారు.

వీడియోకి ఆయ‌న‌ ‘ఫ్రాడ్‌న్యూస్‌ సీఎన్‌ఎన్ ఫన్’ అనే పేరు పెట్టారు. అధ్యక్షుడు అయివుండి ట్రంప్ ఇలా వీడియోను పోస్ట్ చేశారేంట‌ని నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వైట్‌హౌస్‌లో పలువురు అధికారులు కూడా త‌మ అధ్య‌క్షుడు ఇలా ప్ర‌వ‌ర్తించి ఉండ‌కూడ‌దని అంటున్నారు. ట్రంప్ పోస్ట్ చేసిన ఈ వీడియోను మీరూ చూడండి...

  • Loading...

More Telugu News