: నన్ను చూసి హీరోయిన్ క‌త్రినా కైఫ్ అనుకుంటున్నారు తెలుసా: న‌ర్గీస్ ఫక్రి ట్వీట్


తనను చూసి హీరోయిన్ కత్రినా కైఫ్ అనుకొని కొందరు ఫొటో దిగుతామని అడుగుతున్నారని 'బంజో' అనే హిందీ సినిమాలో నటించిన న‌ర్గీస్ ఫక్రి తెలిపింది. అందుకు కారణం లేకపోలేదు. ఆమె చూడడానికి అచ్చం కత్రినా కైఫ్ లా ఉంటుంది. ఇటీవల తన వద్దకు ఓ వ్య‌క్తి వ‌చ్చి 'హాయ్ క‌త్రినా' అన్నాడ‌ని, త‌న‌తో ఓ ఫోటో దిగొచ్చా? అని కూడా అడిగాడ‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది.

దీంతో తాను క‌త్రినాను కాదని చెప్పాన‌ని, ఆ అభిమాని అస‌లు విష‌యం తెలుసుకున్నాడ‌ని నర్గీస్ తెలిపింది. అయిన‌ప్ప‌టికీ తాను క‌త్రినా లాగానే ఉంటాను కాబ‌ట్టి త‌న‌తో ఫోటో దిగుతాన‌ని ఆ అభిమాని అన్నాడ‌ని న‌ర్గీస్ చెప్పింది. అయితే, తాను అది కుద‌ర‌ద‌ని చెప్పి వెళ్లిపోయిన‌ట్లు తెలిపింది.   

  • Loading...

More Telugu News