: చర్లపల్లి జైల్లో.. బ్లేడ్లు మింగిన ఖైదీ
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఈ రోజు కలకలం చెలరేగింది. అందులో శిక్ష అనుభవిస్తోన్న ఓ ఖైదీ బ్లేడ్లను మింగేశాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆ ఖైదీ డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథ్ వేధింపులు భరించలేకే ఇలా ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. ఆ ఖైదీ పేరు జి.రత్నం అని సంబంధిత అధికారులు తెలిపారు. ఓ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.