: ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో 'వైబ్‌ కే5 నోట్‌'పై రూ.3 వేల డిస్కౌంట్


ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి రేపు అర్ధరాత్రి 12 వరకు లెనోవో వైబ్‌ కే5 నోట్‌పై స్పెషల్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ట్లు దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ను అస‌లు ధ‌ర కంటే 3 వేల రూపాయల డిస్కౌంట్‌తో 9,499 రూపాయలకే అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపింది. లెనోవో కే-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చి రెండో ఏడాది ముగుస్తున్న నేప‌థ్యంలో ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు చెప్పింది. లెనోవో వైబ్‌ కే5 నోట్‌ పేరిట లభ్యమవుతున్న స్మార్ట్ ఫోన్ మోడ‌ళ్లలోని 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ కు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.

             లెనోవో కే5 నోట్‌ ఫీచర్లు...
           5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ  ఐపీఎస్‌ డిస్‌ప్లే
           64 బిట్‌ ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ10 ప్రాసెసర్‌
           13ఎంపీ వెనుక‌ కెమెరా
           8ఎంపీ ముందు కెమెరా
           3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం

  • Loading...

More Telugu News