: వన్డే క్రికెట్ లో వికెట్ కీపర్ గా ధోనీ అరుదైన రికార్డు!


వన్డే క్రికెట్ లో అత్యథిక మ్యాచ్ లకు వికెట్ కీపర్ గా సేవలందించిన రెండో ఆటగాడిగా ఎం.ఎస్.ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. భారత్-వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన నాల్గో వన్డే ఇందుకు వేదికైంది. ధోనీ తన వన్డే కెరీర్లో ఇప్పటి వరకు 295 మ్యాచ్ లకు వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. కాగా, శ్రీలంక క్రికెట్ ప్లేయర్ సంగక్కర 360 వన్డే మ్యాచ్ లకు వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహించి అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ కు చెందిన వికెట్ కీపర్లు వరుసగా  ధోనీ (295 మ్యాచ్ లు), మార్క్ బౌచర్ (294 మ్యాచ్ లు), గిల్ క్రిస్ట్ (287 మ్యాచ్ లు), మొయిన్ ఖాన్ (211 మ్యాచ్ లు) నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్ గా సేవలందించిన ప్లేయర్ల జాబితాలో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. 

  • Loading...

More Telugu News