: వేధింపులు తాళలేక.. హైదరాబాద్‌లో నవవధువు ఆత్మహత్య
పెళ్లి జరిగిన నాలుగు నెలలకే ఓ యువతి తనువు చాలించిన ఘటన హైదరాబాద్ శివారు ఆల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన భర్త ప్రతి విషయానికి గొడవ పడుతుండడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇక తన భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓపిక నశించి ఈ రోజు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకి ఉరివేసుకుంది. ఆ యువతి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి పేరు నీరజా రెడ్డి (27) అని, ఆమెకు జీడిమెట్లకి చెందిన సుచిన్‌రెడ్డితో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి జరిగిందని పోలీసులు తెలిపారు.