: సినిమా కోసం గుండు కొట్టించుకుంటున్న హీరోయిన్ పూర్ణ!
‘కొడి వీరన్’ అనే తమిళ చిత్రంలోని పాత్ర కోసం నటి పూర్ణ గుండుతో కనిపించనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ పాత్ర సహజత్వం కోసం ఎటువంటి విగ్ వాడకుండా, గుండు చేయించుకునేందుకు ఆమె సిద్ధపడిందట. ఆ పాత్రపై ఉన్న మక్కువ కారణంగానే ఆమె అందుకు సిద్ధపడిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అలాగే మిస్కిన్ దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమాలో పూర్ణ ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించనుంది.
కాగా, రఘుబాబు డైరెక్షన్‌లో వచ్చిన ‘అవును’ సినిమాతో టాలీవుడ్‌లో నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి కథానాయకుడిగా ఇటీవల వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించిన పూర్ణ, తన కెరీర్‌లోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నాళ్లూ అవకాశాలు కలిసి రాక ఆమె సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటోంది. అందుకే పాత్ర కోసం ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.