: నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ స్తంభంపై చిరుత మృతి
నిజామాబాద్ జిల్లాలోని మల్లారం అటవీ ప్రాంతం పరిధిలో ఓ చిరుత హల్‌చల్ చేసింది. చివరకు ఓ విద్యుత్ స్తంభం ఎక్కేసింది. దీంతో కరెంట్ వైర్లకు తగిలిన ఆ చిరుత స్తంభంపైనే మృతి చెందింది. షాక్‌తో చిరుత ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్న స్థానికులు సమాచారం అందించడంతో... పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. చనిపోయిన ఆ చిరుత పులిని విద్యుత్ స్తంభంపై నుంచి కిందకు దించి, దాన్ని అక్కడి నుంచి తరలించారు. చిరుత చనిపోయిందని తెలుసుకున్న స్థానికులు దాన్ని చూడడానికి పెద్ద ఎత్తున వచ్చారు.