: రక్తపు మడుగులో యువతి.. రక్షించమని అరుస్తున్నా ఆదుకోని స్థానికులు.. వీడియోలు తీసిన వైనం!
హర్యానా జింద్‌లోని మరోలీ అనే గ్రామంలో సంజూ అనే ఓ యువతిపై ఆమె భర్త విచక్షణారహితంగా దాడి చేశాడు. ఓ రంపంతో ఆమె శరీర భాగాలపై ఆయన దాడి చేయడంతో వీధిలోకి పరుగులు తీసింది. తనను తన భర్త బారి నుంచి రక్షించాలని స్థానికులను వేడుకుంది. స్థానికులు ఆమెను రక్షించకపోవడమే కాకుండా, తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలో ఆ దృశ్యాలను వీడియోలు తీశారు. చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె భుజం, కడుపులో, మొకాలిపై గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు.
బాధితురాలు సంజూ తన ముగ్గురు పిల్లలతో కలిసి మరోలీలో ఉంటుందని, ఆమె భర్త నరేశ్ ప్రతిరోజు గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. వేధింపులు భరించలేక ఇటీవల సంజూ తన భర్తపై కేసు పెట్టిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఆమె కళ్లలో కారం చల్లిన నరేశ్.. ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. ప్రస్తుతం సంజూ ఆసుపత్రిలో కోలుకుంటోంది. నరేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.