: ఆ సంప్రదాయాన్ని వైఎస్సార్సీపీ తుంగలో తొక్కింది: సీఎం చంద్రబాబు


సిట్టింగ్ అభ్యర్థి చనిపోయిన సందర్భాల్లో ఆ కుటుంబంలో ఒకరిని ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని వైఎస్సార్సీపీ తుంగలో తొక్కిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ రోజు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ లో ఇంటింటీకి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నంద్యాల ఉపఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించేలా పనిచేయాలని తమ పార్టీ నేతలకు సూచించారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల బాధ్యతలను కాల్వ శ్రీనివాసులు, సుజనాచౌదరి, నారాయణకు చంద్రబాబు అప్పగించారు.

  • Loading...

More Telugu News