: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం మరో అప్లికేషన్
టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం పోటీ పెరుగుతోంది. ఇప్పటికే సెహ్వాగ్, రవిశాస్త్రి, దొడ్డ గణేష్, లాల్ చంద్ రాజ్ పుత్, టామ్ మూడీలు పోటీలో ఉన్నారు. తాజాగా వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సిమన్స్ ఈ పదవి కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. విండీస్, ఐర్లండ్, జింబాబ్వే జట్లకు ఇప్పటి వరకు సిమన్స్ కోచ్ గా సేవలందించాడు. సిమన్స్ కోచ్ గా ఉన్న సమయంలోనే వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి జూలై 9 వరకు బీసీసీఐ గడువు విధించింది. 10వ తేదీన కొత్త కోచ్ ఎవరో ప్రకటిస్తామని ఇటీవల గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే.