: రోజా గురించి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడటం బాగోలేదన్న కేసీఆర్!


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఏపీ టీడీపీ సీనియర్ నేత ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడటం బాగోలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారట. రోజా వ్యవహార శైలిని నిరసిస్తూ ముద్దుకృష్ణమనాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ పత్రికల్లో కూడా వచ్చాయి. అదే రోజున, కేసీఆర్ తమ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతల ప్రకటనలు, వాటిపై స్పందనల గురించిన అంశం చర్చకు వచ్చింది. ‘ముద్దుకృష్ణమనాయుడు మా కంటే సీనియర్. మేము కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకొన్నాం. ఆయన రోజా గురించి  మాట్లాడటం బాగోలేదు..ఆయన స్థాయికి తగదు..ముద్దన్నకు ఈ విషయం చెప్పండి’ అని కేసీఆర్ అన్నారట.

ఈ సమావేశం అనంతరం, ముద్దుకృష్ణమనాయుడుకి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫోన్ చేసి..‘అన్నా, మీ గురించి మేం మాట్లాడుకున్నాం. మీ స్థాయి తగ్గించుకోవద్దు' అని చెప్పారు. ఇందుకు స్పందించిన ముద్దుకృష్ణమనాయుడు, ‘నా పై చూపిన అభిమానానికి ధన్యవాదాలు. రాజకీయాల్లో ఉన్నపుడు మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే, ప్రత్యర్థులు చెప్పేవే ప్రజల్లోకి వెళ్తాయి’ అని చెప్పారట.

  • Loading...

More Telugu News