: ఆల్ ది బెస్ట్ సుప్రీంహీరో: మంచు మనోజ్
బీవీఎస్ రవి దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న జవాన్ సినిమాకు సంబంధించి, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయంటూ సదరు హీరో తాజాగా ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్ సుప్రీం హీరో అంటూ ట్వీట్ చేశాడు. సాయిధరమ్ తేజ్ చేసిన పోస్ట్‌ను షేర్ చేస్తూ, తనకు ఆ ట్వీట్ బాగా నచ్చిందంటూ మనోజ్ ఓ ఎమోజీని జోడించాడు. దీంతో సాయిధరమ్ తేజ్ మంచు మనోజ్ కి థ్యాంక్యూ చెప్పాడు. సెప్టెంబరు 1న ఈ సినిమాను విడుదల చేయాలని ఆ సినిమా యూనిట్ భావిస్తోంది.