: సల్మాన్ ప్రియురాలితో వెంకటేష్.. వైరల్ అవుతున్న ఫొటో!


ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ పై ఎప్పటి నుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోసారి ఈ ఊహాగానాలకు రెక్కలు వచ్చాయి. విషయంలోకి వెళ్తే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రియురాలు లులియా వాంటర్ తో కలసి వెంకటేష్ ఒకే కారులో కనిపించారు. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ పార్టీలో సల్మాన్, లులియాలతో వెంకీ భేటీ అయి, చాలా సేపు చర్చలు జరిపారట.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలసి నటించే విషయంపై చర్చించేందుకే ఈ పార్టీకి వెంకీ వెళ్లారని చెబుతున్నారు. మరోవైపు, సల్మాన్ ప్రియురాలు లులియా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే కోణంలో కూడా చర్చ మొదలైంది. అయితే, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మాత్రం ఇంతవరకు ఎవరూ వెల్లడించకపోవడం గమనార్హం. లులియాతో కలసి వెంకీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు వెంకటేష్, సల్మాన్ ఖాన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News