: కరెన్సీ స్మగ్లింగ్ కేసులో అడ్డంగా బుక్కయి, దుబాయ్ పారిపోయిన పాకిస్థానీ సూపర్ మోడల్... అరెస్టుకు ఆదేశాలు


పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ మోడల్, రెండేళ్ల నాడు దాఖలైన కేసులో జైలు జీవితం అనుభవించి ఆపై బెయిల్ పై బయటకు వచ్చి దేశం విడిచి పారిపోయిన అయ్యాన్ అలీని అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు దాఖలయ్యాయి. కరెన్సీ స్మగ్లింగ్ కేసులో ఆమె అడ్డంగా బుక్కయింది. ఇస్లామాబాద్ లోని బేనజీర్ భుట్టో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆమె వద్ద 5,06 లక్షల డాలర్లు లభించడంతో ఇస్లామాబాద్ కస్టమ్స్ విభాగం ఆమెను 2015 నవంబర్ లో అరెస్ట్ చేశారు.

సూపర్ మోడల్ గా రాణిస్తున్న అయ్యాన్, తప్పును ఒప్పుకోకపోవడంతో విచారణ ప్రారంభించిన కోర్టు నాలుగు నెలల జైలు జీవితం అనంతరం బెయిల్ ను మంజూరు చేసింది. ఆపై ఈ సంవత్సరం ఫిబ్రవరి 23న పాకిస్థాన్ నుంచి తప్పించుకుని దుబాయ్ కి పారిపోయింది. 12 మార్లు కోర్టు విచారణకు రాకపోవడంతో ఆగ్రహించిన న్యాయస్థానం ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచాలని ఆదేశించింది. కాగా, తన తల్లి ఆరోగ్యం బాగాలేని కారణంగానే ఆమె కోర్టుకు రాలేకపోయారని రావల్పిండి కోర్టుకు అయ్యాన్ తరఫు న్యాయవాది చెప్పగా, న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News