: భారత జర్నలిస్టులను అడ్డుకుని బుద్ధి చూపిన చైనా!
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, భారత జర్నలిస్టులను టిబెట్ లోకి రానివ్వకుండా అడ్డుకుని చైనా తన బుద్ధి చూపించింది. ప్రతి సంవత్సరమూ నేపాల్, ఇండియాకు చెందిన జర్నలిస్టులను టిబెట్ లో పర్యటనకు చైనా అనుమతిస్తూ వస్తుంది. "ఈ సంవత్సరం కూడా నేను టిబెట్ వెళ్లాలని భావించాను. రెండు రోజుల క్రితం ఈ ట్రిప్ ను రద్దు చేస్తున్నట్టు చైనా ఎంబసీ పేర్కొంది" అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ కరస్పాండెంట్స్ కన్వీనర్ విజయ్ నాయక్ వెల్లడించారు.
ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినందునే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలిపారు. కాగా, జర్నలిస్టుల బృందం ఈ నెల 8 నుంచి 15 వరకూ టిబెట్ లో పర్యటించాల్సి వుంది. గత సంవత్సరం టిబెట్ రాజధాని లాసాతో పాటు సియాచిన్ లోని చెంగ్డూలోనూ విలేకరుల బృందం పర్యటించింది.