: గుంటూరు జిల్లా నేతలపై చంద్రబాబు ఆగ్రహం!


గుంటూరు జిల్లా టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించిన సమావేశానికి నేతలు హాజరుకాకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వార్తలు వార్తాపత్రికల్లో కూడా రావడంతో... చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో, నేతల వివరణను ఆయన కోరారు. దీనికి సమాధానంగా, సమాచార లోపం వల్లే తాము సమావేశానికి హాజరు కాలేకపోయామని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వొద్దని, మళ్లీ రిపీట్ అయితే తాను క్షమించనని నేతలకు చంద్రబాబు చిన్నపాటి క్లాస్ పీకారట.

  • Loading...

More Telugu News