: 'వీఐపీ-2'లో విలన్ పాత్ర కోసం మొదట్లో రజనీ కాంత్ ని అడిగారట!


ధనుష్ కు విలన్ గా రజనీకాంత్ ను నటించమన్నారన్న వార్త ఒకటి కోలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఆ వివరాలలోకి వెళితే, ప్రస్తుతం నిర్మాణంలో వున్న 'వీఐపీ-2' సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిర్మాతగా కూడా ధనుష్ వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తోంది.

అయితే ఈ సినిమా అనుకున్నప్పుడు ఇందులో ప్రతినాయకుడు (విలన్) గా రజనీకాంత్ ను నటింపజేయాలని సౌందర్య భావించిందట...దీంతో నేరుగా వెళ్లి కథను చెప్పి, తన తండ్రి రజనీని నటించాలని కోరిందట. అయితే, వివిధ కారణాలు చెబుతూ రజనీ ఆ పాత్రలో నటించేందుకు నిరాకరించారట. దీంతో ఆ పాత్ర స్వరూపాన్ని మార్చేసి, ఆ తర్వాత కాజోల్ ను తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగులో 'రఘువరన్ బీటెక్' సినిమాకు ఇది సీక్వెల్ గా రానుంది. 

  • Loading...

More Telugu News