: అదెక్కడుందో చెప్పవూ?... దినేష్ కార్తీక్ భార్య దీపికతో హార్దిక్ పాండ్యా సరదా సంభాషణ!


భారత స్వాష్ ప్లేయర్, క్రికెటర్ దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను పెట్టగా, మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. దూరంగా సముద్రాన్ని చూస్తూ, ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ లో సేదదీరుతున్న తన చిత్రాన్ని "భర్తతో ప్రయాణం చేయడం చాలా కష్టమైన పని" అని క్యాప్షన్ పెడుతూ దీపిక పోస్ట్ చేయగా, ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో చెప్పాలని పాండ్యా కోరాడు.

పాండ్యా ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అది అంటిగ్వాలోని బ్లూ వాటర్ రిసార్ట్ అని చెప్పింది. అంతేకాదు, తమ విల్లాలో ఓ ప్రైవేట్ పూల్ ఉందని, వస్తే నిమ్మరసం ఇస్తానని చెప్పింది. ఇక పాండ్యా ఊరుకుంటాడా? "ఇంతవరకూ నాకీ విషయమే చెప్పలేదు. కొంచెమాగు వచ్చేస్తున్నా. నిమ్మరసంతో పాటు చాట్ మసాలా కూడా కావాలి" అని అడిగాడు. వీరి సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News