: 'బాహుబలి' ఎఫెక్ట్.. నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న రమ్యకృష్ణ!
'బాహుబలి' సినిమా అఖండం విజయం సాధించడంలో శివగామి క్యారెక్టర్ ది కీలకపాత్ర అనడంలో సందేహం లేదు. బాహుబలి స్థాయిలో శివగామికి ఈ సినిమాలో అంతే ప్రాధాన్యత ఉంది. ఈ పాత్రను పోషించిన రమ్యకృష్ణకు సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఇప్పుడు ఆమెకు అనేక సినిమాల్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ఈ భారీ సక్సెన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది శివగామి. తన రెమ్యునరేషన్ ను ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పెంచేసింది. ఈ భారీ మొత్తాన్ని ఇస్తేనే సినిమాలో నటిస్తానని ఆమె తెగేసి చెబుతోందట. రెమ్యునరేషన్ విషయంలో ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆమె మాత్రం వినడం లేదట.