: అమెరికన్ రిపోర్ట్...79 సంస్థలు ట్రంప్ నినాదాన్ని నిజం చేసేందుకు దాడులను ప్రోత్సహిస్తున్నాయి
అమెరికన్ల కోసమే అమెరికా అంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు 79 సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రికా జర్నలిస్టు తెలిపాడు. ట్విట్టర్ లో అమెరికాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. వైట్ హౌస్ లో ట్రంప్ కాలుమోపిన దగ్గర్నుంచి అమెరికన్లలో ఈ ధోరణి పెచ్చుమీరిందని ఆయన పేర్కొన్నాడు. ఇలాంటి వారికి కాలిఫోర్నియా స్వర్గధామంగా మారిందని ఆయన ఆరోపించాడు.
79 సంస్థలు నాన్ అమెరికన్లపై దాడులు చేసేందుకు ప్రోత్సహిస్తున్నాయని ఆయన తెలిపాడు. నాన్ అమెరికన్లపై విద్వేషం నింపే ఆ సంస్థల్లో భారీగా సభ్యులుగా చేరారని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. కాలిఫోర్నియాలోని డీగో, లాస్ ఏంజీల్స్ లో ఉండే కొంతమంది నాన్ అమెరికన్లను ఆ సంస్థలు వెళ్లగొట్టాయని ఆయన వెల్లడించాడు. శరణార్థులు, నాన్ అమెరికన్లు ఇన్ ల్యాండ్ లో తలదాచుకుంటారని, ప్రస్తుతానికి వారు సురక్షితంగా ఉన్నప్పటికీ కాలిఫోర్నియా, లాస్ ఏంజీల్స్ లాంటి చోట్లకు వారు వెళ్లలేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.