: మా బ్యాటింగే కొంపముంచింది!: కోహ్లీ
వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, 190 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడాన్ని అరుదైన ఘటనగా చెప్పాడు. బ్యాట్స్ మెన్లు చెత్త షాట్ లను సెలెక్ట్ చేసుకోవడం వల్లనే ఓటమిపాలయ్యామని తెలిపాడు. షాట్ ల సెలెక్షన్ తమ స్థాయికి తగ్గట్టు లేదని... కీలక దశలో వికెట్లను కోల్పోయామని చెప్పాడు. మ్యాచ్ పై పట్టు సాధించడంలో విఫలమయ్యామని అన్నాడు. తమ బౌలర్లు స్థాయికి తగ్గట్టుగానే మెరుగైన ప్రదర్శన చేశారని... బౌలర్లు, ఫీల్డర్లు బాగా కృషి చేశారని చెప్పాడు. విండీస్ గెలుపుకు సంబంధించిన క్రెడిట్ వారి బౌలర్లకే వెళుతుందని తెలిపాడు. కేవలం బ్యాటింగ్ వైఫల్యంతోనే తాము మ్యాచ్ ను కోల్పోయామని చెప్పాడు.