: ఓడితే పూర్తి బాధ్యత నాదే: అఖిలప్రియ


నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం ఖాయమని భూమా అఖిలప్రియ వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థి గెలిస్తే, చంద్రబాబు సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పట్టినట్టని, ఓడిపతే మాత్రం తన వైఫల్యంగానే భావిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే, అందుకు పూర్తి బాధ్యత తీసుకుని తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. కార్యకర్తలంతా తన వెంటే ఉన్నారని, వారంతా పార్టీ విజయం కోసం కృషి చేస్తారని అన్నారు. త్వరలోనే తాను ఇంటింటి ప్రచారానికి వెళ్లనున్నట్టు అఖిలప్రియ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News