: 9వ తేదీన బెంగళూరు వెళుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9వ తేదీన బెంగళూరు వెళుతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు ప్రముఖుల వివరాలతో కూడిన డైరెక్టరీని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ డైరెక్టరీని నాగేశ్వరరావు అనే వ్యక్తి రూపొందించారు. మొత్తం 300 మంది ప్రముఖుల వివరాలను డైరెక్టరీలో పొందుపరిచారు. వీరిలో రాజకీయవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు విద్యాసంస్థల ప్రముఖులు, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు, వివిధ కంపెనీల ఛైర్మన్లు ఉన్నారు.