: కొంచెం పెరిగింది... నేటి 'పెట్రో' ధరలు
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో, ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటరు పెట్రోలుపై 7 పైసల వరకు, డీజిల్ పై 11 పైసల వరకూ పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.13, డీజిల్ - రూ. 53.47
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.18, డీజిల్ - రూ. 55.77
ముంబై: పెట్రోలు - రూ. 74.35, డీజిల్ - రూ. 58.79
చెన్నై: పెట్రోలు - రూ. 65.51, డీజిల్ - రూ. 56.29
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.0, డీజిల్ - రూ. 58.24