: విజయవాడలో మందుబాబు కౌంటర్: బార్ మూసేయాలంటూ మహిళల ఆందోళన... మరోపక్క బార్ తెరవాలంటూ తాగుబోతు బైఠాయింపు!


విజయవాడలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఎనికేపాడు, కానురు మధ్యనున్న మైత్రీవనంలో 'కృషి బార్' ఉంది. దాని ఎదురుగా మరో బార్ ను ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో స్థానిక మహిళలు బార్ మూసేయాలంటూ ఆందోళన చేశారు. కొత్త బార్ యజమాని చక్రవర్తి తన స్థలంలో బార్ ఏర్పాటు చేస్తే సమస్య ఏంటని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. చాలా కాలంగా ఉన్న కృషి బార్ మద్యం అమ్మితే మౌనంగా ఉన్న మహిళలు, తాను బార్ ఏర్పాటు చేస్తే రాద్దాంతం చేస్తున్నారని, ముందు కృషి బార్ మూసేస్తే తన బార్ కూడా మూసేస్తానని స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో మహిళలు పట్టువిడువకుండా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం టెంట్ వేసి ఆందోళన చేస్తున్న మహిళల ముందు పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి బార్ తెరవాలంటూ ఆందోళనకు దిగాడు. తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించాడు. మద్యం వద్దని ఆందోళన చేస్తున్న వారి దగ్గరకి తాగుబోతు రావడంతో అంతా కంగారుపడ్డారు.

  • Loading...

More Telugu News