: ఆ లక్ష కంపెనీలకు మరో ఎదురుదెబ్బ.. వాటిని ముప్పుతిప్పలు పెట్టేందుకు రెడీ అవుతున్న కేంద్రం!
ఒక్క కలం పోటుతో రద్దైన లక్ష కంపెనీలపై ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. వాటిని ముప్పుతిప్పలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ట్యాక్సేషన్‌ను, మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలపై ప్రభుత్వం వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయా కంపెనీలపై మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడంతోపాటు ఆయా కంపెనీల్లో డైరెక్టర్టర్లుగా వ్యవహరించిన వారిపై ఐదేళ్ల నిషేధం విధించాలని యోచిస్తోంది. అంటే వారు మరే ఇతర కంపెనీల్లోనూ ఆ పదవులు నిర్వహించడానికి వీలుండదు. రిజిస్ట్రేషన్ రద్దయిన లక్ష కంపెనీలపై చర్యల కోసం ఇప్పటికే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఎంసీఏ) లేఖలు రాసినట్టు సమాచారం.