: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సిరియా.. 21 మంది దుర్మరణం


వరుస కారు బాంబు పేలుళ్లతో సిరియా రాజధాని డమాస్కస్ వణికిపోయింది. ఆదివారం జరిగిన ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో తొలుత ఓ ఆత్మాహుతి సభ్యుడు కారులో తనను తాను పేల్చేసుకున్నాడు. నగర శివార్లలో భద్రతా దళాలు వాహనాలను తనిఖీ చేస్తుండగా మరో రెండు కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం 8 మంది చనిపోగా 13 మంది తీవ్రంగా గాయపడినట్టు సిరియా అధికారిక టెలివిజన్ పేర్కొనగా, సిరియా మానవ హక్కుల సంఘం మాత్రం 21 మంది చనిపోయినట్టు పేర్కొంది. ఈ ఘటనలకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఇటీవల ఇక్కడ జరిగిన పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించడంతో తాజా పేలుళ్లు కూడా ఐఎస్ పనేనని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News