: నేటి నుంచి తమిళనాడులో సినిమా ధియేటర్ల బంద్!
నేటి నుంచి తమిళనాడులోని సినిమా ధియేటర్లను మూసివేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం తెలిపింది. జీఎస్టీ పేరుతో తమపై వేసిన భారాన్ని మోస్తూ థియేటర్లు నడిపే సామర్థ్యం తమకు లేదని చెప్పారు. తాము ఎవరికీ వ్యతిరేకంగా పని చేయడం లేదని, తమ ఆవేదనను ఇలా తెలియజేస్తున్నామని వారు పేర్కొన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పేందుకు, ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని తెలిపేందుకే థియేటర్లను మూసేస్తున్నామని వారు చెప్పారు. జీఎస్టీ భారం తగ్గించేవరకు థియేటర్లు తెరిచేది లేదని వారు తేల్చిచెప్పారు.