: నా అకౌంట్ కి ఏమైంది?: ట్విట్టర్ లో ఫేస్ బుక్ పై అమితాబ్ ఆగ్రహం!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుుక్ పై ఆగ్రహం కలిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకునే బిగ్ బీ ఫేస్ బుక్ ఖాతా తెరుచుకోవడం లేదు. దీంతో ఆయన కేవలం ట్విట్టర్ ను మాత్రమే వినియోగించాల్సి వస్తోంది. ఫేస్ బుక్ ద్వారా ఆయన తన అభిమానులకు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నారు. ఇది ఆయనకు అసహనం కలిగించింది.
దీంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఫేస్ బుక్ ను ‘ఫేస్ బుక్.. నా ఖాతా ఎందుకు తెరవడంలేదు? కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. అభిప్రాయాలు పంచుకోవాల్సిన మాధ్యమాన్ని ఫిర్యాదులు చేయడానికి వాడాల్సి వస్తోంది. ఇది చాలా బాధాకరం’ అంటూ నిలదీశారు. కాగా, అమితాబ్ ప్రస్తుతం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘102 నాటౌట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా మాధ్యమంగా అభిమానులకు వెల్లడించడం అమితాబ్ కు ఆనందం కలిగిస్తుంది.