: హాంగ్ కాంగ్ ప్రజలకు చైనా అధ్యక్షుడి వార్నింగ్


హాంగ్ కాంగ్ పాలకుల మార్పిడి జరిగి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆ దేశంలో పర్యటించారు. జిన్‌ పింగ్‌ పర్యటన సందర్భంగా పలువురు హాంగ్ కాంగ్‌ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హాంగ్ కాంగ్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను చైనా నిర్దేశిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు చాలా కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్‌ పాలకుల చేతుల్లోంచి చైనా చేతుల్లోకి హాంగ్ కాంగ్ వెళ్లి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం పేరుతో హాంకాంగ్‌ లో చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ప్రజలు గీత దాటితే సహించబోమని హెచ్చరించారు.

హాంగ్ కాంగ్ ప్రజలు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఇంతకుముందెన్నడూ లేరని చెప్పారు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ విధానానికి హాంగ్ కాంగ్‌ ప్రజలు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. ఆసియాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హాంగ్ కాంగ్‌ మరింత అభివృద్ధి చెందడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆందోళనలు దేశ పురోగతిని దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News