: మహిళా క్రికెట్: నిలకడగా ఆడుతున్న భారత్... కట్టుదిట్టమైన బౌలింగ్ తో పాక్


ప్రపంచ మహిళా వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ లోని డెర్బీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డేలో టీమిండియా బ్యాట్స్ వుమన్ నిలకడగా ఆడుతున్నారు. తొలి మ్యాచ్ లో ఆకట్టుకుని, మలి మ్యాచ్ లో సెంచరీతో ఆకట్టుకున్న స్మృతి మందాన పాక్ తో మ్యాచ్ లో విఫలమైంది. కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డయాన్ బేగ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుటైంది.

అనంతరం జట్టు బాధ్యతను పూనమ్ రౌత్ (47) భుజానవేసుకుంది. చెత్తబంతులను బౌండరీకి తరలిస్తూ ఆకట్టుకుంది. అర్ధసెంచరీకి చేరువలో నష్రా సంధు బౌలింగ్ లో ఆమెకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో భారత జట్టు 22.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి దీప్తి శర్మ(17) కు కెప్టెన్ మిథాలీ రాజ్ (4) జత కలిసింది. వస్తూనే బౌండరీ బాది తన ఉద్దేశాన్ని చాటి చెప్పింది. 

  • Loading...

More Telugu News