: బీజేపీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడు... మీరెప్పుడైనా చూశారా?: కలకలం రేపుతున్న కర్ణాటక సీఎం వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. బెళగావిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బెళగావి బీజేపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఎందుకు కోల్పోయాడో తెలుసా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. 'దానిపై ఓసారి మీరు ఆయననే అడగండి' అని ఆయన ప్రజలకు సూచించారు. అసలు బ్లూ ఫిల్మ్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎప్పుడైనా ఒక్కసారైనా దానిని మీరు చూశారా? అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయనాయకులంతా అసెంబ్లీని దేవాలయంలా భావిస్తారని ఆయన చెప్పారు. అలాంటి దేవాలయం లోపల మీ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. 'అలాంటి ఎమ్మెల్యేని అధికారంలో ఉంచకూడదు. వెంటనే దించేయాల'ని ఆయన సూచించారు. అసలు ఇలాంటి వ్యక్తులు జనజీవనంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. చేసిన తప్పుకు ప్రతిగా రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయనకు సిద్ధరామయ్య సూచించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.