: ఆ పాటను లీక్ చేసింది అఖిలే!
పైరసీ భూతం ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోందని పలువురు నటులు బాధపడిపోవడం టీవీల్లో చూస్తుంటాం. అయితే తన సినిమాలో పాటను తానే లీక్ చేశాడు, స్టార్ హీరో అఖిల్ అక్కినేని. తొలి సినిమా ఫ్లాప్ తో కెరీర్ ప్రారంభించిన అఖిల్ అక్కినేని.... మలి సినిమాను 'మనం' ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే దుబాయ్ లోని అబూదాబిలో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో అఖిల్ తన ప్రతిభను ప్రదర్శిస్తూ 'ఏవేవో కలలు కన్నా' అనే పల్లవితో సాగే పాటను వేదికపై పాడాడు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఈ పాట అతని కొత్త సినిమాలోనిదేనని తెలుస్తోంది. అయితే ఈ పాటతో అఖిల్ తన సినిమాపై క్రేజ్ ను పెంచేశాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ అఖిల్ తన సినిమాలోని పాటను తానే లీక్ చేయడం విశేషం.