: విజయవాడలో వైద్యుడి కిడ్నాప్ కలకలం
విజయవాడలో వైద్యుడి కిడ్నాప్ కలకలం రేపింది. విజయవాడలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యుడ్ని గుర్తు తెలియని ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. అనంతరం 30 లక్షల రూపాయలు ఇస్తే అతనిని వదిలేస్తామని అతని కుటుంబ సభ్యులతో బేరానికి దిగారు. ఇంతలో కిడ్నాపర్లను ఏమార్చిన వైద్యుడు వారి నుంచి తప్పించుకుని మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు కిడ్నాపర్లు హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది.