: శేఖర్ రెడ్డి డైరీలో పలువురు ప్రముఖుల నిక్ నేమ్స్... కీలక సమాచారం దొరికిందంటున్న పోలీసులు


అక్రమ ఇసుక వ్యాపారంలో ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉచ్చులో చిక్కుకున్న టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి డైరీలో పలువురు ప్రముఖుల పేర్లు నిక్ నేమ్స్ తో ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. గత సంవత్సరం చివర్లో శేఖర్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపినప్పుడు సుమారు రూ. 132 కోట్ల నగదు, 177 కిలోల బంగారం దొరికి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో తమకు లభించిన డైరీలో హెల్త్‌ మినిస్టర్‌, హైవేస్‌ మినిస్టర్‌, జేడి మైనింగ్‌, టెంపుల్‌, టెంపుల్‌ సన్‌ అంటూ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అవి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ సహా, ఓ అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఉన్నతాధికారి, మరో మంత్రి, ఇతర అధికారులను సూచించేవేనని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై విచారణ అధికారులు మరింత లోతుగా దర్యాఫ్తును ప్రారంభించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News