: సామూహిక హింస పెరగడంపై రాష్ట్రపతి హెచ్చరిక
ఇండియాలో రోజురోజుకూ పెరిగిపోతున్న సామూహిక హింసపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలు ప్రాధమిక సిద్ధాంతాలను మరువరాదని అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, "ఒక వ్యక్తి ఏదైనా నిబంధనను ఉల్లంఘించాడనో లేదా చట్టాన్ని అతిక్రమించాడనో నిజా నిజాలు తెలుసుకోకుండా, పలువురు కలసి దాడి చేయడం, ప్రాణాలు తీయడం వంటి విషయాలను టీవీలు, దినపత్రికల్లో చూసి తెలుసుకుంటున్నాం. నియంత్రణా రహితంగా వ్యవహరించడం సరికాదు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ, జాతి ప్రయోజనాలను కాపాడాలి" అని ప్రణబ్ అన్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని హెచ్చరించారు. వెనుకబడిన తనంపై నిఘా పెట్టి, అభివృద్ధి దిశగా ఎలా పయనించాలన్న విషయమై ఆలోచించాలని హితవు పలికారు. ఎవరి పేర్లనూ వెల్లడించకుండానే ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, గో సంరక్షణ పేరుతో ఇటీవల పెరిగిన దాడులనే ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది.