: అమెరికాను ఘోరంగా అవమానించిన పాక్.. అంతర్జాతీయ ఉగ్రవాదికి భారీ భద్రత!


అమెరికాను మిత్ర దేశంగా చెప్పుకుంటున్న పాక్.. ఆ దేశాన్ని ఘోరంగా అవమానించింది. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను వారం క్రితం అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ముందు ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన సలాహుద్దీన్‌కు పాక్‌లో ఘన స్వాగతం లభించింది.

అమెరికా ప్రకటన తర్వాత తొలిసారి ఆయన ముజఫరాబాద్‌ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించాడు. దీనికి ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూసి ప్రపంచం విస్తుపోయింది. పాక్ తాజా వైఖరితో ఉగ్రవాదులపై ఆ దేశానికున్న ప్రేమ మరోమారు బహిర్గతమైంది. కాగా, సలాహుద్దీన్‌కు ప్రజలు ఘన స్వాగతం పట్టడం, అతడి ప్రెస్ మీట్‌కు ప్రభుత్వం భారీ భద్రత కల్పించడాన్ని చూస్తే ఉగ్రవాదులకు పాక్ భూతల స్వర్గమన్న విషయం మరోమారు తేటతెల్లమైందని  చెబుతున్నారు. పాక్ తన తాజా చర్యతో అమెరికాను ఘోరంగా అవమానించడమేనని అంటున్నారు.

  • Loading...

More Telugu News