: ఇక పెట్రోలు, డీజిల్ కొనబోము... నిల్వలు ముగియగానే బంద్: కీలక నిర్ణయం తీసుకున్న బంకుల యాజమాన్యాలు
5వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయరాదని బంకుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రో ఉత్పత్తుల విషయంలో రోజువారీ ధరను ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యాజమాన్యాలు, ధరలను నిత్యమూ సవరిస్తుంటే, చాలా ఇబ్బందిగా ఉందని ఆరోపించాయి. రోజువారీ ధరల విధానానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, పెట్రో నిల్వలు ఉన్నంత వరకూ మాత్రమే విక్రయాలు జరిపి, ఆ తరువాత బంకులను మూసివేస్తామని పెట్రో డీలర్లు స్పష్టం చేశారు. ఈలోగా ప్రభుత్వం స్పందించి, రోజువారీ ధరల మార్పును వెనక్కు తీసుకోకుంటే, అమ్మకాలు పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించాయి.