: సీఎంకు అధిష్ఠానం పిలుపు.. 6న ఢిల్లీకి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురంలో ఇందిరమ్మ బాటను వాయిదా వేసుకున్నారు. ఢిల్లీకి రావాలంటూ ముఖ్యమంత్రికి అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసమ్మతి నేతలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అధిష్ఠానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు సమాచారం లేకుండా సీఎం సొంతంగా పథకాలను ప్రకటిస్తున్నారంటూ, కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ సైతం నివేదిక ఇచ్చారు.